ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinese New Year Event: లాస్ ఏంజెలెస్‌లో దారుణం.. చైనీస్ న్యూ ఇయర్ వేడుకల్లో గర్జించిన తుపాకి!

ABN, First Publish Date - 2023-01-22T16:04:31+05:30

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌( Los Angeles)లో శనివారం రాత్రి నిర్వహించిన చైనా కొత్త సంవత్సర(Chinese New Year)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌( Los Angeles)లో శనివారం రాత్రి నిర్వహించిన చైనా కొత్త సంవత్సర(Chinese New Year) వేడుకల్లో జరిగిన కాల్పులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. మోనటరీ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది మంది హాజరయ్యారు. వేడుకల్లో అందరూ ఉత్సాహంగా చిందులేస్తున్న వేళ రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. దీంతో జనం భయంతో చెల్లాచెదరుయ్యారు.

అప్పటి వరకు ఆనందంతో కేరింతలు కొట్టిన జనం.. కాల్పులు జరిగిన వెంటనే హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ఎంతమంది మరణించారు? అన్న విషయంలో స్పష్టత లేదు. అలాగే, అనుమానితుడు పట్టుబడ్డాడా? లేదంటే పరారీలో ఉన్నాడా? అన్న విషయంలోనూ స్పష్టత లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో క్షతగాత్రులకు పోలీసులు సాయం అందిస్తుండడం కనిపిస్తోంది. అలాగే, వీధుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సమీపంలో ఉన్న రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే చాలామంది తన రెస్టారెంట్‌లోకి పరుగులు పెట్టుకుంటూ వచ్చారని, ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో కాల్పులు జరిపినట్టు వారు తనతో చెప్పారని పేర్కొన్నట్టు ‘ఎల్ఏ టైమ్స్’ తెలిపింది. పార్క్‌లోని డ్యాన్స్ క్లబ్‌లో కాల్పులు జరిగినట్టు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-01-22T16:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising