ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinese New Year Event: చైనీస్ న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు.. 9 మంది మృతి

ABN, First Publish Date - 2023-01-22T17:22:33+05:30

వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధ్రువీకరించారు. చైనా లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌( Los Angeles)లో శనివారం రాత్రి నిర్వహించిన చైనా కొత్త సంవత్సర(Chinese New Year) వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధ్రువీకరించారు. చైనా లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయపడినట్టు తొలుత వార్తలు వచ్చాయి. తాజాగా, మృతుల సంఖ్యను పోలీసులు వెల్లడించారు.

లాస్ ఏంజెలెస్ డౌన్ టౌన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంటెరీ పార్క్‌లో దాదాపు 60 వేల మంది ఆసియా వాసులు నివసిస్తున్నారు. ఇక్కడ జరిగిన నూతన సంవత్సర వేడుకలకు వేలాదిమంది మంది హాజరయ్యారు. వేడుకల్లో అందరూ ఉత్సాహంగా చిందులేస్తున్న వేళ రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. దీంతో జనం భయంతో చెల్లాచెదరుయ్యారు.

అప్పటి వరకు ఆనందంతో కేరింతలు కొట్టిన జనం.. కాల్పులు జరిగిన వెంటనే హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో క్షతగాత్రులకు పోలీసులు సాయం అందిస్తుండడం కనిపించింది. అలాగే, వీధుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సమీపంలో ఉన్న రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే చాలామంది తన రెస్టారెంట్‌లోకి పరుగులు పెట్టుకుంటూ వచ్చారని, ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో కాల్పులు జరిపినట్టు వారు తనతో చెప్పారని పేర్కొన్నట్టు ‘ఎల్ఏ టైమ్స్’ తెలిపింది. పార్క్‌లోని డ్యాన్స్ క్లబ్‌లో కాల్పులు జరిగినట్టు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

Updated Date - 2023-01-22T17:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising