ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pakistan : పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరల గురించి తెలుసుకుంటే..

ABN, First Publish Date - 2023-09-01T11:57:33+05:30

వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి జారుకుంటున్న ఆ దేశంలో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.14.91 పెరగింది, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 చొప్పున పెరిగింది.

ఇస్లామాబాద్ : వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి జారుకుంటున్న ఆ దేశంలో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.14.91 పెరగింది, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 చొప్పున పెరిగింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.305.36కు చేరింది, లీటరు డీజిల్ ధర రూ.311.84కు చేరింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

దశాబ్దాల చరిత్రలో ఎరుగనంతటి తీవ్ర స్థాయి సంక్షోభంలో పాకిస్థాన్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలి ఆర్థిక సంస్కరణలు విపరీతమైన ద్రవ్యోల్బణానికి, అత్యధిక వడ్డీ రేట్లకు దారి తీశాయి. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాకిస్థానీ రూపాయి విలువ పతనం కొనసాగుతుండటంతో సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతోంది. పాకిస్థానీ రూపాయి ఒక అమెరికన్ డాలర్‌కు రికార్డు స్థాయి కనిష్టానికి పతనమైంది. ఒక డాలర్‌కు రూ.305.6కు కరెన్సీ పతనమవడం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కకర్ నేతృత్వంలోని మంత్రివర్గం పరిపాలన బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆర్థిక స్థిరత్వం దిశగా దేశాన్ని నడపటం ఈ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 3 బిలియన్ డాలర్లు ఉద్దీపన ప్యాకేజీకి అంగీకరించడంతో పాకిస్థాన్ కాస్త ఊపిరి తీసుకుంటోంది.


ఇవి కూడా చదవండి :

Bomb Threat : ‘తాజ్ హోటల్‌ను ఇద్దరు పాకిస్థానీలు పేల్చేస్తారు’.. ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్..

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు

Updated Date - 2023-09-01T11:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising