Bomb Threat : ‘తాజ్ హోటల్‌ను ఇద్దరు పాకిస్థానీలు పేల్చేస్తారు’.. ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్..

ABN , First Publish Date - 2023-09-01T09:26:24+05:30 IST

నగరంలోని మెయిన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తాజ్ హోటల్ (Taj Hotel)ను పేల్చేసేందుకు ఇద్దరు పాకిస్థానీలు వస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. సముద్ర మార్గంలో వీరు వస్తారని ఆ వ్యక్తి చెప్పాడు. తన పేరు ముకేశ్ సింగ్ అని ఆ వ్యక్తి చెప్పుకున్నాడు.

Bomb Threat : ‘తాజ్ హోటల్‌ను ఇద్దరు పాకిస్థానీలు పేల్చేస్తారు’.. ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్..

ముంబై : నగరంలోని మెయిన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తాజ్ హోటల్ (Taj Hotel)ను పేల్చేసేందుకు ఇద్దరు పాకిస్థానీలు వస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. సముద్ర మార్గంలో వీరు వస్తారని ఆ వ్యక్తి చెప్పాడు. తన పేరు ముకేశ్ సింగ్ అని ఆ వ్యక్తి చెప్పుకున్నాడు.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన పేరు ముకేశ్ సింగ్ అని పరిచయం చేసుకుని ఓ వ్యక్తి ముంబై మెయిన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు ఫోన్ చేశాడు. ఇద్దరు పాకిస్థానీలు సముద్ర మార్గంలో వస్తారని, నగరంలోని ప్రముఖ తాజ్ హోటల్‌ను పేల్చేస్తారని హెచ్చరించాడు. అయితే దర్యాప్తు అనంతరం ఈ ఫోన్ చేసిన వ్యక్తి పేరు జగదాంబ ప్రసాద్ సింగ్ (35) అని వెల్లడైంది. అతను ఉత్తర ప్రదేశ్‌లోని గోండా ప్రాంతానికి చెందినవాడని, ప్రస్తుతం శాంతాక్రజ్‌లో నివసిస్తున్నాడని తెలిసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.

ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌పై 2008లో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి :

Former CM: సుమోటోగా మాజీ సీఎం అక్రమార్జన కేసు

Congress Adjustment of seats : నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు!

Updated Date - 2023-09-01T09:26:24+05:30 IST