ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: గ్రిడ్ వైఫల్యం...పాక్‌లో అలముకున్న అంధకారం

ABN, First Publish Date - 2023-01-23T12:25:59+05:30

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది....

Pakistan Grid failure
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ :ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది.(Pakistan)పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం గ్రిడ్ వైఫల్యం(Grid failure) కారణంగా భారీ విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పవర్ గ్రిడ్ వైఫల్యం వల్ల పాకిస్థాన్ దేశంలోని ఇస్లామామాబాద్, లాహోర్, కరాచీ(Islamabad,Lahore,Karachi) నగరాలతోపాటు బలూచిస్థాన్ లోని 22 జిల్లాల్లో అంధకారం అలముకుంది.(Lahore without electricity) నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని, దీని ఫలితంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం అయిందని పాకిస్థాన్ ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

పాక్ దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ అంతరాయాన్ని ధ్రువీకరించాయి.గుడ్డు నుంచి క్వెట్టాకు రెండు ట్రాన్స్మిషన్ లైన్లు ట్రిప్ అయ్యాయని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ తెలిపింది. క్వెట్టాతో సహా బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా లేదు. లాహోర్,కరాచీ నగరాల్లోని పలు ప్రాంతాల్లో కూడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.ఇస్లామాబాద్‌లో 117 గ్రిడ్ స్టేషన్‌లలో విద్యుత్తు సరఫరా లేదు. పెషావర్‌లో కూడా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2023-01-23T12:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising