ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Matthew Perry:ఫ్రెండ్స్ నటుడు మ్యాథ్యూ పెర్రీ అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2023-10-29T10:27:18+05:30

ప్రముఖ హాలీవుడ్ నటుడు(Hollywood Actor), ఫ్రెండ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించిన మ్యాథ్యూ పెర్రీ(Matthew Perry) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాథ్యూ పెర్రీ(54) నిన్న సాయంత్రం లాస్ ఏంజెల్స్(Los Angeles)లోని తన నివాసంలో టబ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

లాస్ ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు(Hollywood Actor), ఫ్రెండ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించిన మ్యాథ్యూ పెర్రీ(Matthew Perry) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాథ్యూ పెర్రీ(54) నిన్న సాయంత్రం లాస్ ఏంజెల్స్(Los Angeles)లోని తన నివాసంలో టబ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే మ్యాథ్యూ చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఆయన హాట్ వాటర్ టబ్ లో మునిగి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కార్డియాక్అరెస్ట్(Cardiac arrest) జరిగి బాత్ టబ్ లో మునిగి ఉండవచ్చిని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆయన 1969 ఆగస్టు 19న మసాచుసెట్స్‌లోని విలియమ్స్ టౌన్‌లో జన్మించారు.


పదుల సంఖ్యల్లో సినిమాల్లో నటించారు. మ్యాథ్యూ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు చెప్పారు. కొన్నేళ్ల క్రితం మ్యాథ్యూ పెయిన్ కిల్లర్స్, మద్యానికి అలావాటు పడ్డారని, అలవాటు మానుకోవడానికి రిహాబిలిటేషన్ సెంటర్లలో చికిత్స తీసుకున్నారని సన్నిహితులు తెలిపారు. 1997 - 2001 వరకు ఆయన చికిత్స పొందారని వివరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించానని.. అయినా ఫలితం లేకుండా పోయిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికన్ రొమాంటిక్ కామెడీ సరీస్ ఫ్రెండ్స్ సినిమాలో చాండ్లర్ బింగ్(Chandler Bing) పాత్రలో నటించారు. ఆ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. మ్యాథ్యూ మృతిపై ప్రపంచ దేశాల సినిమా రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-10-29T10:27:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising