ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Australia: భార్య కళ్లముందే భర్త దుర్మరణం.. అంబులెన్స్ వచ్చే లోపే..

ABN, First Publish Date - 2023-01-30T19:48:49+05:30

పాము కాటుకు గురైన ఓ వ్యక్తి భార్య కళ్లముందే ప్రాణాలు వడిచాడు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలోగల లాకర్ వ్యాలీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: పాము కాటుకు(Snake Bite) గురైన ఓ వ్యక్తి భార్య కళ్లముందే ప్రాణాలు వడిచాడు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌(Queensland) రాష్ట్రంలోగల లాకర్ వ్యాలీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నాయి. తమ ఇంటి వద్దే కుప్పకూలిపోయిన భర్తను చూసి ఆయన భార్య తీవ్రభాందోళనలకు లోనైంది. సాయం చేయాలంటూ పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేసింది. అంబులెన్స్ వచ్చేలోపే ఆయన మృతి చెందారు. కాగా.. హెలికాప్టర్లు, నాలుగు అంబులెన్స్‌, పోలీసుల రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగిందని స్థానికులు తెలిపారు. తన యోగక్షేమాలు తెలుసుకునేందుకు పలువురు ఫోన్లు చేశారని పొరుగున ఉన్న ఓ మహిళ మీడియాకు తెలిపింది. ‘‘మృతుడి భార్య పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేయడం తాము విన్నామని కొందరు నాతో చెప్పారు’’ అని ఆమె పేర్కొంది.

క్వీన్స్ ల్యాండ్‌లో ప్రస్తుతం పాముల బెడద ఎక్కువైంది. వాతావరణంలో వేడి, తేమ ఎక్కువ కావడంతో బయటకు వస్తున్న పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. కాగా.. కొద్ది రోజుల క్రితమే హర్వే బేలోని ఓ ఇంటి టాయిలెట్‌లో భారీ పాము కనిపించడం కలకలం రేపింది. ఓ వ్యక్తి బాత్‌రూమ్‌లోని కమ్మోడ్ మూత ఎత్తగా నాలుగు అడుగుల పాము కనిపించింది. దీంతో.. అతడు పాములు పట్టే వాళ్లకు సమాచారం అందించాడు. ఆ పాము విషపూరితమైనది కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - 2023-02-01T11:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising