ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రీటర్మ్‌ బేబీల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి! డాక్టర్లు ఏమంటున్నారంటే..!

ABN, First Publish Date - 2023-06-01T10:36:38+05:30

డాక్టర్‌! మా బాబు 34 వారాలకే పుట్టాడు. గత వారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చాం! బాబు ఆరోగ్యంగా

preterm babies
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశ్న: డాక్టర్‌! మా బాబు 34 వారాలకే పుట్టాడు. గత వారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చాం! బాబు ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.

- రాధ, కొత్తగూడెం

ఏ బిడ్డ అయినా 40 వారాలకు పుట్టాలి. అలాకాకుండా 37 వారాలకంటే ముందే ప్రసవమైతే, అలా పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్‌ బేబీస్‌ అంటారు. సాధారణంగా 34 వారాలు దాటి పుడితే లేట్‌ ప్రీటర్మ్‌ అనీ, 34 వారాలకంటే ముందే పుడితే ఎర్లీ ప్రీటర్మ్‌ అని వర్గీకరిస్తారు. లేట్‌ ప్రీటర్మ్‌ బేబీలకు ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలేవీ ఉండవు. శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉండేలా చూసుకుంటూ, కామెర్లు పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది. డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ జాగ్రత్తలతోపాటు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకుంటూ, వైద్యులను కలుస్తూ ఉండాలి. 24 వారాలకంటే ముందు పుట్టిన ఎక్స్‌ట్రీమ్‌ ప్రీటర్మ్‌ పిల్లలు, 28 నుంచి 34 వారాలు లేదా అంతకంటే ముందే పుట్టిన ఎర్లీ ప్రీటర్మ్‌ పిల్లలకు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

అవేంటంటే...

ప్రీమెచ్యూర్‌ బేబీ‌స్‌కి అవయవాలన్నీ ఏర్పడినా, అవి ఇంకా ఎదుగుదల దశలోనే ఉంటాయి. పిల్లలు ఎంత ముందుగా పుడితే అన్ని ఎక్కువ రోజులు న్యూబోర్న్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసియూ)లో ఉంచవలసి ఉంటుంది. 34 నుంచి 36 వారాల మధ్యలో పుట్టిన పిల్లలు ఒకటిన్నర కిలోల బరువుకు చేరుకుంటేనే డిశ్చార్జి చేయవలసి ఉంటుంది. ఆలోగా తమంతట తాముగా తల్లి పాలు తాగగలిగే శక్తి పిల్లలకు సమకూరుతుంది. చర్మం కూడా ఎదిగి ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతుంది. మెదడులో ఉండే శ్వాశ పీల్చుకునే భాగం కూడా పూర్తిగా ఎదుగుతుంది. డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ప్రత్యేకమైన గదిలో ఉంచి, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. బిడ్డను తాకే ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాలు ఉన్నవాళ్లను దూరంగా ఉంచాలి. ఈ పిల్లలు తాగిన పాలు వాంతి చేసుకుంటూ ఉంటారు. వాంతి అయినప్పుడు పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పాలు తాగిన వెంటనే భుజం మీదకు ఎత్తుకుని, వీపు మీద సున్నితంగా తడుతూ, త్రేన్పులు వచ్చేలా చేయాలి. 32 వారాలకు పుట్టిన పిల్లలు, లేదా ఒకటిన్నర కిలోల బరువుతో పుట్టే పిల్లలకు వినికిడి, కంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి కంట్లో రక్తనాళాల ఎదుగుదల గురించి కంటి డాక్టరు చేత పరీక్ష చేయించాలి. అలాగే వినికిడి శక్తిని తెలుసుకోవడం కోసం హియరింగ్‌ స్ర్కీనింగ్‌ కూడా చేయించాలి. అలాగే ప్రతి రెండు వారాలకు పిల్లల ఎదుగుదలను తెలుసుకోవడం కోసం వైద్యులను కలుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కూడా మిగతా పిల్లల్లా ఆరోగ్యంగానే పెరుగుతారు.

-డాక్టర్‌ దినేశ్‌ కుమార్‌ చిర్ల

పీడియాట్రీషియన్‌ అండ్‌ నియో నాటాలజిస్ట్‌,

రెయిన్‌బో హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-06-01T10:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising