ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rice Water: బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..!? అయితే ఓ సారి..!

ABN, First Publish Date - 2023-03-16T12:59:08+05:30

సాధారణంగా బియ్యాన్ని (Rice Water) కడిగిన తర్వాత నీళ్లను మొక్కల్లో పోస్తారు. దీని వల్ల మొక్కలు (Plants) ఏపుగా పెరుగుతాయి. ఈ నీళ్లను మొక్కలకు పోయటమే కాకుండా జుట్టు

Rice Water
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాధారణంగా బియ్యాన్ని (Rice Water) కడిగిన తర్వాత నీళ్లను మొక్కల్లో పోస్తారు. దీని వల్ల మొక్కలు (Plants) ఏపుగా పెరుగుతాయి. ఈ నీళ్లను మొక్కలకు పోయటమే కాకుండా జుట్టు (hair) ఒత్తుగా పెరగటానికి కూడా ఉపయోగించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్‌ అనే ఒక కార్బోహైడ్రేట్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ కార్పొహైడ్రేట్‌ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టును బియ్యం (Rice) కడిగిన నీళ్లతో తలంటుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

  • బియ్యం కడిగిన నీళ్లతో తలంటుకుంటే చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు కూడా పోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది.

  • కొందరికి జుట్టు జిడ్డుగా ఉంటుంది. అలాంటి వారు బియ్యం కడిగిన నీళ్లతో తలంటుకోకూడదు. ఒక వేళ తలంటుకుంటే జుట్టు పొడిబారిపోతుంది.

  • వారానికి ఒక సారి లేదా రెండు సార్లు మాత్రమే బియ్యం నీళ్లతో తలంటుకొమ్మని నిపుణులు సూచిస్తున్నారు.

బియ్యం నీళ్ల తయారీ ఇలా...

  • ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోయాలి. బియ్యాన్ని చేతితో బాగా రుద్దాలి.

  • 30 నిమిషాల తర్వాత నీళ్లను వేరే గిన్నెలో పోయాలి

  • ఈ నీళ్లను తలపై పోసుకొని బాగా మర్దనా చేయాలి

  • ఒక పది నిమిషాల తర్వాత జట్టును చల్లటి నీళ్లతో కడగాలి

Updated Date - 2023-03-16T12:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising