ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tati munjalu: వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే...!

ABN, First Publish Date - 2023-03-15T14:27:12+05:30

వేసవి (Summer) వచ్చిందంటే తాటి ముంజల విక్రయాలు జోరందుకుంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి

స్పెషాలిటీ ఏంటంటే...!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డీ హైడ్రేషన్‌ నుంచి విముక్తి

విటమిన్లు, నీటి శాతం అధికం

వేసవి తాపం నుంచి ఉపశమనం

హైదరాబాద్, షాపూర్‌నగర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): వేసవి (Summer) వచ్చిందంటే తాటి ముంజల విక్రయాలు జోరందుకుంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. తాటి ముంజలను ఇష్టపడని వారు ఉండరు. నగర శివారుల నుంచి తీసుకొచ్చి తాటి ముంజల (Tati munjalu)ను విక్రయిస్తుంటారు. డజను ముంజలు రూ. 60 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు.

తాటి ముంజలు గర్భిణులకు (pregnant women) ఔషధంలా పనిచేస్తాయని వైద్యులు అంటున్నారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. వేసవిలో ముంజలు తింటే డీహైడ్రేషన్‌ (Dehydration) నుంచి విముక్తి కలుగుతుంది. ప్రాంతాలను బట్టి కొందరు వీటిని సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుకుంటారు. ముంజలను చిన్న చిన్న ముక్కలుగా కోసి స్వీట్లు, లస్సీ, జ్యూస్‌, సలాడ్‌తోపాటు చికెన్‌, మటన్‌లో వేసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాటి ముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

ఉపయోగాలు

  • తాటి ముంజల్లో తక్కువ కాలరీలు ఉంటాయి. శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి.

  • వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్‌, చక్కెరలని సమతుల్యం చేస్తాయి.

  • గర్భిణులకు మంచి ఆహారం. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.

  • ముంజల్లో ఎ, బి, సి విటమిన్‌లు, ఐరన్‌, జింక్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

  • కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. వీటిలో అధిమొత్తంలో పొటాషియం ఉంటుంది.

  • ఎండ, వేడికి వాంతులు అయినట్లు అనిపిస్తే తాటి ముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది.

  • ట్యుమర్‌, బ్రెస్ట్‌ క్యాన్స్‌ర్‌ కణాలను వృద్ధిచేసే పెట్రోకెమికల్స్‌, అంథోసయనిన్‌ లాంటి వాటిని నిర్మూలించి క్యాన్స్‌ర్‌ నుంచి విముక్తి చేస్తాయి.

పోషకాలు మెండు

వేసవిలో తాటి ముంజలు తింటే మంచిది. శరీరానికి పోషకాలు అందిస్తాయి. డీహైడ్రేషన్‌ భారిన పడకుండా ముంజలు దోహదపడతాయి. ముఖ్యంగా గర్భిణులు తాటిముంజలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచి జరుగుతుంది. సీజనల్‌గా లభించే పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిది.

- డాక్టర్‌ పరమేశ్వర్‌

Updated Date - 2023-03-15T14:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising