ఏపీలో టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే...!
ABN, First Publish Date - 2023-04-24T12:44:36+05:30
పదో తరగతి పరీక్ష ఫలితాలను (Tenth Results) మే 2వ వారంలో
Tenth results
అమరావతి(ఆంధ్రజ్యోతి), బాపట్ల టౌన్, ఏప్రిల్ 23: పదో తరగతి పరీక్ష ఫలితాలను (Tenth Results) మే 2వ వారంలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఆదివారం బాపట్లలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 శాతం మూల్యాంకణం పూర్తయ్యిందన్నారు. ఈనెల 26వ తేదీకి 100 శాతం పూర్తి చేస్తామని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని మూల్యాంకణ కేంద్రాలలో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Updated Date - 2023-04-24T13:14:04+05:30 IST