ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bank of Indiaలో ఆఫీసర్ పోస్టులు.. ఎన్నంటే..!

ABN, First Publish Date - 2023-02-17T15:31:22+05:30

ముంబయి (Mumbai)లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India)... దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ర్‌ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ల

ఆఫీసర్ పోస్టులు.. ఎన్నంటే..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి (Mumbai)లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India)... దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ర్‌ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ల (Probationary Officers) భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

1. జనరల్‌ బ్యాంకింగ్‌ స్ట్రీమ్‌లో క్రెడిట్‌ ఆఫీసర్‌(జీబీవో): 350

2. ఐటీ ఆఫీసర్‌ ఇన్‌ స్పెషలిస్ట్‌ స్ట్రీమ్‌(ఎ్‌సపీఎల్‌): 150

అర్హత: క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐటీ ఆఫీసర్‌ ఖాళీలకు బీఈ, బీటెక్‌/పీజీ(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2023 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.36,000-రూ.63,840

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష: ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌(35 ప్రశ్నలు, 40 మార్కులు), రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌(45 ప్రశ్నలు, 60 మార్కులు), జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు, 40 మార్కులు), డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌(35 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లీష్‌ డిస్ర్కిప్టివ్‌ పేపర్‌- లెటర్‌ రైటింగ్‌ అండ్‌ ఎస్సే(2 ప్రశ్నలు, 25 మార్కులు)నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 157 ప్రశ్నలు, 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25

వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/

Updated Date - 2023-02-17T15:31:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising