Sahadev: టీ తాగేందుకు వచ్చిన అతడ్ని దారుణంగా...
ABN, First Publish Date - 2023-11-10T13:28:20+05:30
నగరంలోని జేపీనగర్ పుట్టేనహళ్ళి ప్రాంతంలో బుధవారం రాత్రి టీ స్టాల్‌కు వచ్చిన రౌడీషీటర్‌ను గుర్తుతెలియని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నగరంలోని జేపీనగర్ పుట్టేనహళ్ళి ప్రాంతంలో బుధవారం రాత్రి టీ స్టాల్‌కు వచ్చిన రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పుట్టేనహళ్ళి పోలీసుస్టేషన్ పరిధిలోని చుంచనఘట మెయిన్‌రోడ్‌పై ఓ టీస్టాల్ చెంతకు రౌడీషీటర్ సహదేవ్(Sahadev) టీ తాగేందుకు వచ్చారు. అంతలోనే మూడు ద్విచక్రవాహనాలలో వచ్చిన గుంపు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసి పరారీ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగానే వారు వాహనాల్లో పరారు అయ్యారు. కాగా సహదేవ్ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయారు. హత్యకు గురైన సహదేవ్ కోణనకుంటె పోలీసుస్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్నారు. పాతకక్షలే హత్యకు కారణంగా తెలుస్తోంది. హత్యకు పాల్పడిన వారి కోసం పుట్టేనహళ్ళి పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.
Updated Date - 2023-11-10T13:28:21+05:30 IST