అమాయకంగా కనిపిస్తున్నాడు కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ఒకటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కానీ..
ABN, First Publish Date - 2023-02-03T16:28:23+05:30
బీహార్‌కు (Bihar) చెందిన ఆ వ్యక్తి పైకి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు.. కానీ, అతడి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. అతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. కానీ, అతడితో ఇప్పుడు ఎవరూ లేరు..
బీహార్‌కు (Bihar) చెందిన ఆ వ్యక్తి పైకి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు.. కానీ, అతడి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. అతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. కానీ, అతడితో ఇప్పుడు ఎవరూ లేరు.. మొదటి భార్య చనిపోయింది.. రెండో భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది.. మూడో భార్య అనుమానాస్పదంగా మాయం అయింది.. విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు.. మూడో భార్యను అతడే అత్యంత కిరాతంగా చంపేసినట్టు కనుగొన్నారు.. దీంతో మొదటి ఇద్దరి భార్యల గురించి చర్చ మొదలైంది (Bihar Crime News).
ఔరంగాబాద్‌లోని (Aurangabad) షేక్‌పురా గ్రామానికి చెందిన ఆ వ్యక్తి పేరు సుబేలాల్ పాశ్వాన్. ఇటీవల అతని మూడో భార్య చంద్రావతి అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. వరకట్నం వేధింపుల భాగంగా భార్యను సుబేలాల్ హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసినట్టు కనుగొన్నారు. స్థానికులు సుబేలాల్‌ను భార్యల సీరియల్ కిల్లర్ అభివర్ణిస్తున్నారు. సుబేలాల్‌తో ఏ భార్యా ఉండదని, రహస్యంగా చనిపోతారు వేరే వారితో పారిపోతారని పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు (Husband Killed Wife).
స్పృహతప్పడం వెనుక కథ ఇదీ.. అసలు 499 మంది అమ్మాయిలున్న ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒకే ఒక్క అబ్బాయి ఎలా పడ్డాడంటే..
కుస్మీ దేవి అనే మహిళ తన కుమార్తె చంద్రావతికి సుబేలాల్‌తో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, కట్నం కూడా ఇచ్చామని, పెళ్లయిన కొన్ని రోజులకు అంతా బాగానే జరిగిందని చెప్పింది. ఆ తర్వాత కట్నం కోసం (Dowry Harassment) సుబేలాల్ తన కూతురిని హింసించడం మొదలుపెట్టాడని, డబ్బులు రాకపోవడంతో చంద్రావతిని హత్య చేశాడని, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని తగలబెట్టాడని కుస్మీదేవి ఆరోపించింది. గతంలో సుబేలాల్ మొదటి భార్య అనుమానాస్పదంగా మృతి చెందిందని, సుబేలాల్ సహవాసం నచ్చక రెండో భార్య మరొకరితో వెళ్లిపోయిందని, మూడో భార్యను సుబేలాల్ చంపేశాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సుబేలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Updated Date - 2023-02-03T16:28:25+05:30 IST