స్పృహతప్పడం వెనుక కథ ఇదీ.. అసలు 499 మంది అమ్మాయిలున్న ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒకే ఒక్క అబ్బాయి ఎలా పడ్డాడంటే..

ABN , First Publish Date - 2023-02-03T16:06:52+05:30 IST

బీహార్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు (Bihar Board Exam 2023) జరుగుతున్నాయి.. ఇలాంటి తరుణంలో నలందలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.. జిల్లాలోని ఒక పరీక్షా కేంద్రంలో 499 మంది బాలికలు ఉన్న ఓ పరీక్షా కేంద్రంలో ఒక మగ విద్యార్థి పరీక్షలు రాయాల్సి వచ్చింది..

స్పృహతప్పడం వెనుక కథ ఇదీ.. అసలు 499 మంది అమ్మాయిలున్న ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒకే ఒక్క అబ్బాయి ఎలా పడ్డాడంటే..

బీహార్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు (Bihar Board Exam 2023) జరుగుతున్నాయి.. విద్యార్థులందరూ తీవ్రంగా శ్రమించి పరీక్షలకు సన్నద్ధమయ్యారు.. ఇలాంటి తరుణంలో నలందలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.. జిల్లాలోని ఒక పరీక్షా కేంద్రంలో 499 మంది బాలికలు ఉన్న ఓ పరీక్షా కేంద్రంలో ఒక మగ విద్యార్థి పరీక్షలు (499 girls... one boy) రాయాల్సి వచ్చింది.. సెంటర్‌లో అంత మంది అమ్మాయిల మధ్య తాను ఒంటరిగా ఉండడంతో పరీక్ష కేంద్రంలోనే విద్యార్థి ఆరోగ్యం క్షీణించింది.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అసలు అంత మంది అమ్మాయిలు ఉన్న సెంటర్‌లో అబ్బాయి పేరు ఎలా వచ్చిందని అన్వేషిస్తే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

నలందలోని బాలికల కోసం కేటాయించిన బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌ను మనీష్ శంకర్ అనే విద్యార్థికి పరీక్షా కేంద్రంగా (Examination Center) నిర్ణయించారు. బుధవారం అతను పరీక్షా కేంద్రానికి చేరుకోగా అందరూ అమ్మాయిలే కనిపించారు. వారందరి మధ్య తను ఒంటరిగా ఉన్నానని భావించి మనీష్ శంకర్ స్పృహ తప్పి పడిపోయాడు. సెంటర్ నిర్వాహకులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆ ఘటనపై విచారణ జరిపితే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఎగ్జామినేషన్ ఫామ్ నింపేటపుడు మనీష్ పొరపాటుగా తనను తాను ఫిమేల్గా పేర్కొన్నాడు. దీంతో ఇంత అనర్థం జరిగింది (Female was written instead of Male in the admit card).

అరుదైన కేసు.. జరిమానా చెల్లించాల్సిన వ్యక్తే చనిపోతే ఆ డబ్బు ఎవరివ్వాలి..? కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

విచారణలో విద్యార్థి అడ్మిట్‌ కార్డులో పురుషుడు కాకుండా స్త్రీ అని రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అడ్మిట్ కార్డ్‌లో సవరణలు చేయడానికి బోర్డు సమయం కూడా ఇచ్చిందని, అయితే విద్యార్థి తరపున లేదా కళాశాల యాజమాన్యం తరపున ఎటువంటి సవరణా జరగలేదని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. దీని కారణంగానే ఆ విద్యార్థికి విద్యార్థినుల పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్టు చెప్పారు. ఆ విద్యార్థి ఆ పరీక్ష కేంద్రంలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-03T16:06:54+05:30 IST