ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని బైక్ ఎక్కించుకున్నాడు.. కాస్త దూరం వెళ్లగానే చేసిన తప్పేంటో తెలిసొచ్చింది..!

ABN, First Publish Date - 2023-02-21T19:18:32+05:30

ఆ కుర్రాడు బైక్ మీద జోరుగా వెళ్తున్నాడు.. ఇంతలో ఓ అమ్మాయి రోడ్డు మీద నిల్చుని లిఫ్ట్ కావాలని అడిగింది.. మనోడు ఆ అమ్మాయి అందానికి ఫిదా అయి బైక్ ఆపి ఆమెను ఎక్కించుకున్నాడు.. ఆ తర్వాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాడు బైక్ మీద జోరుగా వెళ్తున్నాడు.. ఇంతలో ఓ అమ్మాయి రోడ్డు మీద నిల్చుని లిఫ్ట్ కావాలని అడిగింది.. మనోడు ఆ అమ్మాయి అందానికి ఫిదా అయి బైక్ ఆపి ఆమెను ఎక్కించుకున్నాడు.. ఆమె చెప్పిన వైపు బైక్ పోనిచ్చాడు.. ఆమె అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి తన ముఠాకు అప్పగించింది.. ఆ ముఠా సభ్యులు ఆ కుర్రాడిని చితక్కొట్టి, అతడి బైక్‌ను, అతడి దగ్గరున్న విలువైన వస్తువులను లాక్కొని వెళ్లిపోయారు.. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు (Crime News).

బీహార్‌లోని (Bihar) గోపాల్‌గంజ్‌కు సమీపంలో ఉన్న ఓ జాతీయ రహదారిపై ఇలాంటి దోపిడీలు అనేకం జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు బృందంగా ఏర్పడి ఆ ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు యువతులను, 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు తుపాకులు, మూడు కత్తులు, బ్రెజ్జా కారు, 11 మొబైల్స్, 5 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అందమైన అమ్మాయిలను ఎరగా చూపి యువకులను దోచుకుంటోంది (Beautiful Girls trapped Young men).

ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. ఈ ఒక్క ప్రకటనే ఆ యజమానిని నిండా ముంచేసింది.. రూ.5.50 లక్షలు ఎలా పోగొట్టుకున్నాడంటే..

ఈ ముఠా గోరఖ్‌పూర్ నుంచి ముజఫర్‌పూర్ వరకు NH-27పై రాత్రి సమయంలో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి దోపిడీ సంఘటనలు (Robbery) చేసేదని పోలీసులు తెలిపారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నేరస్తులను అరెస్టు చేయడంతో సిట్ ఊపిరి పీల్చుకుంది. పరారీలో ఉన్న మిగతా నేరస్థుల ఆచూకీ కోసం సిట్‌ గాలిస్తోంది.

Updated Date - 2023-02-21T19:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising