ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. ఈ ఒక్క ప్రకటనే ఆ యజమానిని నిండా ముంచేసింది.. రూ.5.50 లక్షలు ఎలా పోగొట్టుకున్నాడంటే..

ABN , First Publish Date - 2023-02-21T16:32:44+05:30 IST

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక కొత్త రకం మోసాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎన్నో సైబర్ క్రైమ్ నేరాల (Cyber Crime) గురించి విని ఉంటారు. అయితే నోయిడాలో (Greater Noida) జరిగిన ఈ మోసం గురించి వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. ఈ ఒక్క ప్రకటనే ఆ యజమానిని నిండా ముంచేసింది.. రూ.5.50 లక్షలు ఎలా పోగొట్టుకున్నాడంటే..

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక కొత్త రకం మోసాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎన్నో సైబర్ క్రైమ్ నేరాల (Cyber Crime) గురించి విని ఉంటారు. అయితే నోయిడాలో (Greater Noida) జరిగిన ఈ మోసం గురించి వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. నోయిడాలోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీకి చెందిన ముఖేష్ కుమార్ తన ఫ్లాట్‌ను అద్దెకు (Rent) ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి ముఖేష్‌కు ఫోన్ చేశాడు. తాను ఆర్మీలో అధికారినని, వచ్చే నెలలో నోయిడాకు షిఫ్ట్ అవ్వాల్సి ఉందని చెప్పాడు.

తనకు ఫ్లాట్ కావాలని, డబ్బులను ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. అందుకు ముఖేష్ అంగీకరించాడు. అయితే తనది ఆర్మీ బ్యాంక్ ఖాతా అని, దాని నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాడు. దీంతో అతడు చెప్పిన యాప్‌ను ముఖేష్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ద్వారా ముఖేష్ ఫోన్‌ను నిందితుడు హ్యాక్ చేశాడు. ఆ తర్వాత యూపీఐ ద్వారా పలు దఫాలుగా మొత్తం 5 లక్షల 50 వేల రూపాయలు కాజేశాడు.

కాలేజీలో దిగాలుగా కూర్చున్న 17 ఏళ్ల బాలిక.. ఏమైందని అడిగితే ఏడుస్తూ ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన టీచర్.. వెంటనే..!

బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతున్నట్టు వరుసగా మెసేజ్‌లు రావడంతో మోసం జరిగినట్టు ముఖేష్‌కు తెలిసింది. వెంటనే బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత, విచారణ కోసం సైబర్ సెల్‌కు పంపినట్లు సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు (Crime News).

Updated Date - 2023-02-21T16:32:48+05:30 IST