కాలేజీలో దిగాలుగా కూర్చున్న 17 ఏళ్ల బాలిక.. ఏమైందని అడిగితే ఏడుస్తూ ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన టీచర్.. వెంటనే..!

ABN , First Publish Date - 2023-02-21T15:21:05+05:30 IST

ఓ ఆడపిల్లకు ఏదైనా కష్టం వస్తే ఆమె మొదట తన తండ్రి లేదా సోదరుడికి ఫిర్యాదు చేస్తుంది. అలాంటిది వారి వల్లే ఆమె మానసిక క్షోభ అనుభవిస్తుంటే ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కాక ఆ బాలిక తనలో తానే కుమిలిపోయింది.

కాలేజీలో దిగాలుగా కూర్చున్న 17 ఏళ్ల బాలిక.. ఏమైందని అడిగితే ఏడుస్తూ ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన టీచర్.. వెంటనే..!

ఓ ఆడపిల్లకు ఏదైనా కష్టం వస్తే ఆమె మొదట తన తండ్రి లేదా సోదరుడికి ఫిర్యాదు చేస్తుంది. అలాంటిది వారి వల్లే ఆమె మానసిక క్షోభ అనుభవిస్తుంటే ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కాక ఆ బాలిక తనలో తానే కుమిలిపోయింది. తరగతి గదిలో పాఠాలు కూడా సరిగ్గా వినేది కాదు.. దీంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆ బాలికను (Minor Girl) అడిగారు. ఆ బాలిక చెప్పింది విని షాకైపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ బాలిక ఇంటికి చేరుకుని ఆమె తండ్రిని, సోదరుడిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది (Crime News).

ఇంటర్మీడియెట్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు వేధిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా దొరికితే చాలు.. తండ్రి, సోదరుడు ఆమెతో నీచమైన పనులు చేస్తుంటారు. తమ రక్త సంబంధం అని కూడా చూడకుండా ఆమెతో కామ వాంఛ (Sexual Harassment) తీర్చుకుంటారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని ఇద్దరూ బెదిరించారు. వారేం చేస్తోరో అనే భయం, కుటుంబ పరువు పోతుందనే బాధతో ఆ బాలిక నోరు విప్పలేదు. అయితే ఆ బాలిక ఎందుకో బాధపడుతోందని కళాశాల ఉపాధ్యాయులకు అర్థమైంది. ఆమెను అడిగితే అసలు విషయం చెప్పింది.

ఈ పెళ్లి జంట ఎంత చూడముచ్చటగా ఉందో కదూ.. కానీ ఏడాది కూడా కాకముందే ఈ భార్య ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందంటే..

విద్యార్థిని వేదనను అర్థం చేసుకున్న ప్రిన్సిపాల్‌, ఇతర ఉపాధ్యాయులు ఆమెను వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి తండ్రి, సోదరుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను సుమారు ఐదు గంటల పాటు విచారించి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. బాధితురాలి తండ్రి, సోదరుడిపై పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-02-21T15:21:07+05:30 IST