ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TamilNadu: ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.. హెల్మెట్ ధరించి ఆ భర్త చేసిన ఘోరమేంటంటే..

ABN, First Publish Date - 2023-02-05T15:48:00+05:30

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు.. ఇంతలోనే ఏమైందో ఏమో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త అడిగినా అతడితో కలిసి ఉండేందుకు నిరాకరించింది.. దీంతో అతడు దారుణానికి పాల్పడ్డాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు.. ఇంతలోనే ఏమైందో ఏమో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త అడిగినా అతడితో కలిసి ఉండేందుకు నిరాకరించింది.. దీంతో అతడు దారుణానికి పాల్పడ్డాడు.. పట్ట పగలు నడిరోడ్డుపై హెల్మెట్ ధరించి భార్యను హత్య చేశాడు.. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. తమిళనాడులోని (TamilNadu) మధురైలో ఈ ఘటన జరిగింది (Crime News).

మధురైలోని (Madurai) కోవిల్ వీధికి చెందిన వర్ష (19) అనే యువతి కొంతకాలంగా పళని (25) అనే యువకుడితో ప్రేమాయణం సాగించింది. చివరకు ఆరు నెలల క్రితం అతడిని వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరూ బాగానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వర్ష తన పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి తన దగ్గరకు రావాలని భర్త ఎంతగా కోరినా ఆమె వినలేదు. దీంతో పళని శుక్రవారం మధ్యాహ్నం భార్యతో మాట్లాడేందుకు ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లాడు.

తన బస్‌లో ప్రయాణించే బాలికతో కలిసి ట్రైన్ కింద పడిన డ్రైవర్.. కారణమేంటంటే..

ఆ సమయంలో వర్ష ఓ దుకాణం నుంచి తన ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో పళని ఆమెను అడ్డగించి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే వర్ష అతడి మాటలు వినకుండా ముందుకు వెళ్లబోయింది. దీంతో పళని తన వెంట తెచ్చుకున్న కత్తితో వర్షను పొడిచేసి అక్కడి నుంచి పరారయ్యాడు (Husband Killed Wife). స్థానికులు వర్షను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వర్ష మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భార్యను చంపిన పళని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Updated Date - 2023-02-05T15:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising