ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Female SI: ఈ రౌడీ మామూలోడు కాదు.. ఓ మహిళా ఎస్‌ఐపై...

ABN, First Publish Date - 2023-11-18T11:48:28+05:30

స్థానిక చూలైలో మద్యం మత్తులో ఓ రౌడీ మహిళా ఎస్‌ఐ(Female SI)పై అరాచకాలకు పాల్పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

- మహిళా ఎస్‌ఐపై రౌడీ అరాచకం

- వైరల్‌ అవుతున్న వీడియో

పెరంబూర్‌(చెన్నై): స్థానిక చూలైలో మద్యం మత్తులో ఓ రౌడీ మహిళా ఎస్‌ఐ(Female SI)పై అరాచకాలకు పాల్పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వెప్పేరి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గౌరి గురువారం రాత్రి చూలై కురువన్‌ ప్రాంతంలో గస్తీ పనులు చేపట్టారు. ఆ సమయంలో ‘బి’ కేటగిరీ రౌడీగా ఉన్న కిషోర్‌ అలియాస్‌ కాల్వాయ్‌ కిషోర్‌(Kishore alias Kalvai Kishore) మద్యం మత్తులో స్నేహితులతో కలసి ఆ ప్రాంతంలో గలాటా చేస్తుండగా ఎస్‌ఐ అడ్డుకున్నారు. దీంతో అతను ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ‘నేనిలా చేస్తా... ఏం చేస్తారు? అంటూ కిషోర్‌ బిగ్గరగా కేకలు వేసే దృశ్యాలను ఆ ప్రాంతంలోని కొందరు వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వెలువరించారు. దీంతో వెప్పేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కిషోర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా, అతను మద్యం మత్తులో ఉండడంతో హెచ్చరించి పంపారు. శుక్రవారం ఉదయం అతనిని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-18T11:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising