ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: యువతి మృతదేహం ఉన్న ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్నట్టుండి.. పార్క్ చేస్తున్నారా..?

ABN, First Publish Date - 2023-02-20T13:54:29+05:30

యువతి మృతదేహం ఉన్న ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్నట్టుండి విద్యుత్‌ ప్రసారం కావడంతో నివాళులర్పిస్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆంధ్రజ్యోతి: స్థానిక తిరువొత్తియూరు తిరుచ్చినాంకుప్పం వద్ద యువతి మృతదేహం ఉన్న ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్నట్టుండి విద్యుత్‌ ప్రసారం కావడంతో నివాళులర్పిస్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం (ఫిబ్రవరి19) జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తిరుచ్చినాంకుప్పంలో నివసిస్తున్న నందిని కుమార్తె అభినయ ఈ నెల 14న చెవి నొప్పికి చికిత్సలు పొందటానికి ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళింది. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ నెల 17న అభినయ చికిత్స ఫలించక మృతి చెందింది. ఆసుపత్రిలో తప్పుడు చికిత్స కారణంగా ఆమె మృతిచెందినట్లు కుటుంబీకులు ఆరోపించటంతో పోలీసులు జోక్యం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆదివారం ఉదయం యువతి ఇంట అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. అభినయ మృతదేహాన్ని ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉంచారు. అభినయతో పాటు చదివిన విద్యార్థులు నివాళులర్పించేందుకు వచ్చారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఫ్రీజర్‌ బాక్స్‌లో విద్యుత్‌ ప్రసారమైంది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఆ బాక్స్‌ వద్దనున్న 20 మంది ఎగిరి దూరంగా పడ్డారు. వీరిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అజిత్‌ (19) అనే యువకుడు చికిత్స ఫలించక మృతి చెందాడు. సౌమ్య, సుందరి అనే యువతులు తీవ్రగాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-02-20T14:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising