ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Crime: ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. కుర్రాడిపై ఎనిమిది మంది కత్తులతో దాడి.. చివరికి ఏమైందంటే?

ABN, First Publish Date - 2023-09-10T17:24:55+05:30

దేశ రాజధాని ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8 మంది కలిసి ఓ కుర్రాడిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ యువకుడు..

దేశ రాజధాని ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8 మంది కలిసి ఓ కుర్రాడిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్ట్ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో జరిగింది.

సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా.. 8 మంది నిందితులు 18 ఏళ్ల యువకుడ్ని చుట్టుముట్టారు. కొందరు చేతులు, కాళ్లతో చితకబాదుతుండగా.. మరికొందరు కత్తులతో పొడుస్తూ ఒక వీధిలో ఈడ్చుకెళ్లారు. కొన్ని సెకన్ల పాటు ఈ దాడి కొనసాగింది. తనని 8 మంది చుట్టుముట్టడంతో.. పాపం ఆ ఒక్క యువకుడు వాళ్లను ఎదురించలేకపోయాడు. దురదృష్టం ఏమిటంటే.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఈ దాడిని చూస్తూ ఉండిపోయారే తప్ప, అడ్డుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించలేకపోయారు.


ఇంతలో కొందరు దుండగులు వెనకడుగు వేయగా.. నలుగురు మాత్రం ఆ యువకుడిపై తమ దాడిని కొనసాగించారు. చివరికి వాళ్లు యువకుడ్ని ఓవైపుకి నెట్టేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయాలతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అయితే.. అతనికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ దాడికి గల కారణాలేంటో తెలియరాలేదు. బహుశా.. గ్రూప్ సభ్యుల్లో ఏదో వాగ్వాదం జరిగి ఉండొచ్చని, ఈ క్రమంలోనే వాళ్లు దాడి చేసి ఉండొచ్చని తెలుస్తోంది.

మరోవైపు.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మొత్తం 8 మంది నిందితులపై అతనిపై దాడి చేశారని గుర్తించిన అధికారులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిందితుల్ని పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2023-09-10T17:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising