ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cash Without Debit Card: డెబిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఆర్‌బీఐ నిబంధనలు ఇవే..

ABN, First Publish Date - 2023-07-08T20:54:42+05:30

డెబిట్ కార్డు హోల్డర్లు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే తప్పనిసరి ఏటీఎం లకు వెళ్లాల్సిందే. డెబిట్ కార్డు వెంట తీసుకెళ్లలేదనుకోండి ఇబ్బందుల్లో పడ్డట్టే.. అయితే ఇప్పుడు డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెబిట్ కార్డు(Debit Card) హోల్డర్లు నగదు విత్ డ్రా(Cash Withdrawal) చేసుకోవాలంటే తప్పనిసరి ఏటీఎం(ATM)లకు వెళ్లాల్సిందే. డెబిట్ కార్డు(Debit Card) వెంట తీసుకెళ్లలేదనుకోండి ఇబ్బందుల్లో పడ్డట్టే.. అయితే ఇప్పుడు డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా(Cash Withdrawal) చేసుకునే వెసులుబాటు ఆర్బీఐ(RBI) కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల ఏటీఎంలకు ఇది వర్తిస్తుంది. యూపీఐ కార్డులెస్ విత్‌డ్రా విధానంలో డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకోవచ్చు..


యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ దగ్గర BOB Debit Card ఉందనుకోండి.. దగ్గరలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం లేకుంటే..ఇతర బ్యాంకుల ద్వారా కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అది యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

యూపీఐ ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా

  1. ఏదైతే బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారో..ఆ బ్యాంక్ యాప్‌ ద్వారా లాగిన్ అవ్వాలి.

  2. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత UPI QR Cash క్లిక్ చేయాలి.

  3. ఒకసారి మాత్రమే ఉపయోగించే QR Code జనరేట్ అవుతుంది.

  4. తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై QR Cash సెలెక్ట్ చేసుకోవాలి.

  5. వెంటనే ఏటీఎం స్క్రీన్‌పై రూ.2000, రూ. 4000 రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి.

  6. మీకు కావాల్సిన నగదును ఎంచుకుని ఏటీఎం స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను మీ మొబైల్ యాప్‌లోని క్యూఆర్ క్యాష్ విత్‌డ్రాల్ ఆప్షన్ ఉపయోగించి స్కాన్ చేయాలి.

  7. ఏటీఎం నుంచి బయటకు వచ్చిన మీ క్యాష్‌ను కలెక్ట్ చేసుకోండి. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల క్యాష్ విత్‌డ్రా కాకుండా మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయితే వెంటనే మీ బ్యాంకు సమాచారం ఇవ్వాలి. 7 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాకు తిరిగి మీ డబ్బు క్రెడిట్ అవుతుంది.

యూపీఐ క్యూఆర్ క్యాష్ విత్‌డ్రాల్ ఆప్షన్‌లో విత్‌డ్రా పరిమితి

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం.. యూపీఐ క్యూఆర్ క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ ద్వారా ప్రతి నెలా రూ.1లక్ష వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు రూ. 5వేల చొప్పున రోజుకు రెండుసార్లు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

కార్డు బేస్డ్ విత్‌డ్రా కంటే యూపీఐ క్యూఆర్ క్యాష్ విత్‌డ్రాల్ విధానం మరింత సురక్షితమా?

కార్డు బేస్డ్ విత్‌డ్రా కంటే యూపీఐ క్యూఆర్ కోడ్ క్యాష్ విత్‌డ్రా విధానం చాలా సురక్షితం. ఎందుకంటే డెబిట్ కార్డు స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. డెబిట్ కార్డును మిస్సయ్యే అవకాశం ఉండదు. యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా ద్వారా మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు.

Updated Date - 2023-07-08T20:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising