SEBI: మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ నామినీ వివరాలు నమోదు చేసే గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
ABN, Publish Date - Dec 28 , 2023 | 02:40 PM
డీమ్యాట్ అకౌంట్ కలిగిన వారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నవారికి సెబీ(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds), డీమ్యాట్ అకౌంట్(Demat Account) నామినీ వివరాలు జత చేసేందుకు ఉన్న గడువును పొడగిస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీ: డీమ్యాట్ అకౌంట్ కలిగిన వారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నవారికి సెబీ(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds), డీమ్యాట్ అకౌంట్(Demat Account) నామినీ వివరాలు జత చేసేందుకు ఉన్న గడువును పొడగిస్తున్నట్లు తెలిపింది. గతంలో నామినీ జత చేసేందుకు 2023 డిసెంబర్ 31గా గడువు విధించింది.
తాజాగా మరోసారి గడువు పెంచుతున్నట్లు తెలిపింది. మరో 6 నెలల పాటు గడువు పొడగిస్తున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 30వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. నామినీల వివరాలను అందించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ ఆస్తులకు భద్రత కల్పించడంతో పాటు, వారసులకు సాఫీగా వాటి బదిలీ జరిగేలా చూడొచ్చు. ఏఎమ్‌సీలు, డిపాజిటరీ పార్టిసిపెంట్ల రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (RTA) ఈ సమాచారాన్ని 15 రోజులకు ఒకసారి తమ ఖాతాదారులు లేదా యూనిట్ హోల్డర్లకు ఇ-మెయిల్, SMS రూపంలో తెలియజేయాలని సెబీ కోరింది.
నామినీల పేర్లు జత చేసేందుకు వారికి గైడ్ లైన్స్ ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 27న సర్క్యూలర్ జారీ చేసింది. పొడగించిన గడువులోపు ఇన్వెస్టర్లు తప్పనిసరిగా నామినీ పేరు జత చేయాలి. లేదంటే నామినీ పేరు ఇవ్వదలుచుకోలేదని తెలిపే డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. మార్కెట్ నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు నామినేషన్ ఎంచుకునేందుకు గడువును జూన్ 30, 2024 వరకు పొడిగిస్తున్నట్లు సెబీ పేర్కొంది.
నామినీ పేరు జత చేసేందుకు గడువు పెంచడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం అంటే సెప్టెంబర్ 30 గడువు ముగిసే సమయంలోనూ సెబీ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. చాలా మంది ఇన్వెస్టర్లు నామినీ యాడ్ చేయడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో ఆ డెడ్‌లైన్‌ను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. సెబీ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు సద్వినియోగం చేసుకుని నామినీ యాడ్ చేసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Dec 28 , 2023 | 02:40 PM