ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Stock Market: దీపావళి ముహూరత్ ట్రేడింగ్..

ABN, First Publish Date - 2023-11-11T13:37:14+05:30

Muhurat trading - 2023: స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకం. పండగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంటసేపు ట్రేడింగ్ జరుపుతారు. దానినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ గా భావిస్తారు. పండగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు. 2023 ముహూరత్ ట్రేడింగ్ టైమింగ్స్ వెల్లడించింది బాంబే స్టాక్ ఎక్స్చేజీ బీఎస్ఈ(BSE).

ముంబయి: Muhurat trading - 2023: స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకం. పండగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంటసేపు ట్రేడింగ్ జరుపుతారు. దానినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ గా భావిస్తారు. పండగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు. 2023 ముహూరత్ ట్రేడింగ్ టైమింగ్స్ వెల్లడించింది బాంబే స్టాక్ ఎక్స్చేజీ బీఎస్ఈ(BSE).

నవంబర్ 12న ముహూరత్ ట్రేడింగ్ కోసం గంటపాటు స్టాక్ మార్కెట్లు(Stock Market) తెరుచకుని ఉంటాయి. BSE, NSE నోటీస్ ప్రకారం.. సింబాలిక్ ట్రేడింగ్ సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి 7.15 మధ్య జరుగుతుంది. ఇందులో 15 నిమిషాలు ప్రీ-మార్కెట్ సెషన్ ఉంటుందని స్టాక్ ఎక్స్ఛేంజీలు పేర్కొన్నాయి.


ముహూరత్ ట్రేడింగ్ అంటే...

ముహూరత్ ట్రేడింగ్ అనేది దీపావళి రోజున జరిగే ఒక గంట ట్రేడింగ్ సెషన్. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి దీన్ని మంచి సమయంగా పరిగణిస్తారు. ఏదైనా కొత్తగా ప్రారంభించేందుకు దీపావళి అనువైన సమయంగా భావిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ఏడాది పొడవునా ఈ సెషన్‌లో ట్రేడింగ్(Trading) చేయడం వల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందుతారని నమ్ముతారు.

ముహురత్ సమయంలో వ్యాపారం చేయడం వల్ల శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి లభిస్తుందని భావిస్తారు. ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లు, సెక్యూరిటీల లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) వంటి విభాగాలలో ట్రేడింగ్ జరుగుతుంది. గత పది ముహూర్తపు ట్రేడింగ్ సెషన్‌లలో, ఏడుసార్లు స్టాక్ మార్కెట్ లు సానుకూల రాబడితో ముగిశాయని మాస్టర్‌ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జీత్ సింగ్ అరోరా అన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి కోణం నుండి ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలని.. ఈక్విటీ మార్కెట్ అసాధారణమైన రాబడిని అందిస్తుందని వివరించారు.

Updated Date - 2023-11-11T13:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising