Coats: మధురైలో అత్యాధునిక సస్టెయినబిలిటీ కేంద్రాన్ని ప్రారంభించిన ‘కోట్స్’
ABN, First Publish Date - 2023-03-16T19:33:42+05:30
దారాలు, అప్పారెల్, ఫుట్‌వేర్ కాంపోనెంట్స్ తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థ ‘కోట్స్’(Coats)
చెన్నై: దారాలు, అప్పారెల్, ఫుట్‌వేర్ కాంపోనెంట్స్ తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థ ‘కోట్స్’(Coats) మధురై(Madurai)లో అధికారికంగా తమ నూతన అత్యాధునిక సస్టెయినబిలిటీ కేంద్రాన్ని(Sustainability Hub ) ప్రారంభించింది. ఇక్కడి స్పిన్నింగ్, ట్విస్టింగ్ పైలట్ ప్లాంట్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు.
ఇది చైనాలోని షెన్‌జెన్ కోట్స్ సస్టెయినబిలిటీ కేంద్రానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే, రీసైకిల్డ్, పునరుత్పాదక మెటీరియల్స్ దిశగా మారడాన్ని వేగవంతం చేస్తుంది. అంతేకాదు, ఈ రెండు కేంద్రాలు కలిసి పనిచేస్తాయి. అప్పారెల్, ఫుట్‌వేర్, పెర్మార్మెన్స్ మెటీరియల్స్ కోసం సస్టెయినబుల్ స్యూవింగ్ థ్రెడ్స్‌ను ఆవిష్కరించనున్నాయి.
మధురైలోని ఈ సస్టెయినబిలిటీ హబ్ పరిశ్రమలో సస్టెయినబిలిటీని సృష్టించడంలో కీలక పాత్ర పోషించనుంది. అలాగే, వచ్చే ఐదేళ్లలో హరిత సాంకేతికతను, మెటీరియల్స్‌ను అభివృద్ధి చేసేందుకు 10 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ సందర్భంగా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. కోట్స్‌లో స్పిన్నింగ్, ట్విస్టింగ్ కోసం మధురైలో అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
Updated Date - 2023-03-16T19:33:42+05:30 IST