ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvagalamPadayatra: యువగళం దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్‌ షేక్‌ అయింది: లోకేశ్‌

ABN, First Publish Date - 2023-04-15T18:08:59+05:30

యువగళం (Yuvagalam) దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్‌ షేక్‌ అయిందని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ఎద్దేవాచేశారు. యువగళం పాదయాత్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నంద్యాల: యువగళం (Yuvagalam) దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్‌ షేక్‌ అయిందని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ఎద్దేవాచేశారు. యువగళం పాదయాత్ర (YuvagalamPadayatra)లో భాగంగా లోకేశ్ మాట్లాడుతూ మార్ఫింగ్‌ వీడియోలతో వైసీపీ ఫేక్‌ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పరదాలు, పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను దమ్ము, ధైర్యంతో ప్రజల్లో నడుస్తున్నా. నేను ఎవరికీ భయపడే వాడిని కాదు. వివేకా హత్య కేసులో సీబీఐ కరెక్ట్‌గా దర్యాప్తు చేస్తే... అరెస్ట్‌ల లింకులన్నీ తాడేపల్లి కొంపకు వెళ్తాయి. ఇది జగనాసుర రక్త చరిత్ర. జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. రాష్ట్రాభివృద్ధిపై జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదు. గ్రామంలోఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తాం. పేదలపై జగన్‌రెడ్డి కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే లబ్దిదారులకు పెండింగ్‌ బిల్లులు అందజేస్తాం. రంగాపురం ఎన్టీఆర్‌ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’’ అని లోకేశ్‌ ప్రకటించారు.

Updated Date - 2023-04-15T18:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising