ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahatma Gandhi: అనంతలో మహాత్మాగాంధీకి అవమానం.. వైసీపీ ఏం చేసిందంటే?

ABN, Publish Date - Dec 29 , 2023 | 07:45 PM

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.. ఆంగ్లేయుల నుంచి భారత్‌కు స్వాతంత్రం కల్పించిన మహాత్ముడు. సత్య, అహింస సిద్ధాంతాలతో ఆంగ్లేయుల్ని దేశం నుంచి తరిమికొట్టిన మన జాతిపిత. మన భారతీయులు ఆయన్ను గౌరవంగా మహాత్ముడు..

Mahatma Gandhi: మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.. ఆంగ్లేయుల నుంచి భారత్‌కు స్వాతంత్రం కల్పించిన మహాత్ముడు. సత్య, అహింస సిద్ధాంతాలతో ఆంగ్లేయుల్ని దేశం నుంచి తరిమికొట్టిన మన జాతిపిత. మన భారతీయులు ఆయన్ను గౌరవంగా మహాత్ముడు అని పిలుస్తారు. అంతటి గొప్ప వ్యక్తికి అనంతపురంలో ఘోర అవమానం ఎదురైంది. అధికార అహంతో వైసీపీ ఆ మహాత్ముడిని అవమానపరిచారు. దీంతో.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. అనంత ప్రజల నుంచి సైతం వైసీపీకి వ్యతిరేకత ఎదురవుతోంది.

అసలేం జరిగిందంటే.. శుక్రవారం అనంతపురం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టింది. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకూ సాగింది. అప్పటిదాకా ఈ యాత్ర సజావుగానే సాగింది కానీ.. గాంధీ విగ్రహం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందుకు కారణం.. వైసీపీ చేసిన ఘనకార్యమే. గాంధీ చేతిలో ఉన్న కర్రకు వైసీపీ వాళ్లు తమ జెండాని ఎటాచ్ చేశారు. మరింత విడ్డూరం ఏమిటంటే.. చుట్టూ పోలీసులు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు.


జాతిపితను ఒక పార్టీకి ఆపాదించేలా జెండా పెట్టడం సరికాదని ప్రజలు గళమెత్తుతున్నా.. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో.. వైసీపీ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అహంతో వైసీపీ హద్దులు మీరుతోందని మండిపడుతున్నారు. అటు.. ప్రతిపక్షాలు సైతం ఈ విషయంపై ధ్వజమెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చివరికి గాంధీ విగ్రహాన్ని కూడా విడిచిపెట్టడం లేదని, ఇది వైసీపీ నీచ రాజకీయానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా.. వైసీపీ ఇలాంటి పనికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ వర్గీయులు మహత్మాగాంధీ విగ్రహం మెడలో వైసీపీ కండువాలు కప్పారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేపింది. ద‌ళిత సామాజిక వ‌ర్గాలు రంగంలోకి దిగి.. ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టిన వారిని క‌ఠినంగా శిక్షించాలని కోరాయి. ఎస్‌ఐ రామిరెడ్డి ఆ కండువాల్ని తొలగించారు. అటు.. కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కూడా వైసీపీ జెండాను తగిలించారు.

Updated Date - Dec 29 , 2023 | 07:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising