నాలుగేళ్లు ఏం చేశారు?: అశోక్ గజపతిరాజు
ABN, First Publish Date - 2023-05-02T18:30:39+05:30
భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport)కు మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathiraju) విమర్శించారు.
విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport)కు మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathiraju) విమర్శించారు. నాలుగేళ్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా శంకుస్థాపన అంటూ సీఎం జగన్ (CM Jagan) రావడం ఉత్తరాంధ్ర ప్రజలను హేళన చేయడమేనని అన్నారు. దేశంలో మూడు ఎయిర్‌పోర్టులకు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరగ్గా వాటిలో గోవా విమానాశ్రయం అందుబాటులోకి వచ్చి ప్రయాణికులకు సేవలు అందిస్తోందన్నారు. ఇక్కడ మాత్రం మళ్లీ శంకుస్థాపన స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు. నాలుగేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం దీనిపై కనీసం దృష్టి కేంద్రీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో సేవలు, సామాన్య ప్రయాణికులకు విమానయానం అనే లక్ష్యంతో అనాడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి జన సమీకరణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు చేయాల్సిన పనిని జీఎంఆర్‌కి అప్పగించడం ఏమిటని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.
Updated Date - 2023-05-02T18:30:44+05:30 IST