Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. 11 మృతదేహాలు గుర్తింపు
ABN, First Publish Date - 2023-10-30T10:33:19+05:30
జిల్లాలోని జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు.
విజయనగరం: జిల్లాలోని జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. వారిలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో 38 మందికి మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నామని... విశాఖ కేజీహెచ్, ఎన్.ఆర్.ఐ, మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కొక్కరు చొప్పున వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగిస్తామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు.
కాగా.. గత రాత్రి విజయనగరంలోని కంటకాపల్లి రైల్వేజంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో 100 మందికి తీవ్ర గాయాలయ్యారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ రైల్వే బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల పేర్లు కంచుబారిక రవి, గిరిజాల లక్ష్మి, బలరామ్, అప్పలనాయుడు, కాపు శంభం, చల్ల సతీష్, పెనుమర్రి గౌరినాయుడుతోపాటు పలాస ప్యాసింజర్ రైలు గార్డ్ ఎం.ఎస్.రావు కూడా ఉన్నారు. ఇక రాయగడ రైలు ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మృతి చెందారు.
Updated Date - 2023-10-30T10:33:19+05:30 IST