ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Botsa: కావాలంటే నేను ట్యూషన్ చెబుతాను

ABN, First Publish Date - 2023-10-22T12:07:34+05:30

విశాఖ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడు తున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి వ్యాఖ్యానించారు.

విశాఖ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడు తున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నానని, అప్పుడు మామీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించుకున్నామని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, వారి పార్టనర్ మీద సీబీఐ విచారణ అడగాలన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన అధికారంలోకి రాదని.. మరి ఏ రాష్ట్రంలో వస్తుందో తనకు తెలియదని అన్నారు.

మద్యపాన నిషేదంపై మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దశల వారిగా అమలు చేస్తామని చెప్పామని మంత్రి బొత్స అన్నారు. డబ్బు మదంతో ఉన్న వాళ్ళు దాని జోలికి వెళ్తారని, మద్యం రేట్లు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

సిపీఎస్‌పై మాట్లాడుతూ..

ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అయితే ఇప్పుడు సీపీఎస్ రద్దు చేయలేమని... ఉద్యోగులకు దైర్యం చెప్పామని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. వేయలేనిది చేయలేమని చెప్పామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో ఎన్నికలపై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వైఖరిపై అధిష్టానంతో చర్చించి చెబుతామని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. విశాఖ సీఎం కార్యాలయం, పరిపాలన రావడం అంశంపై తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారన్నారు. సామాజిక న్యాయ బస్ యాత్రకు అన్ని అనుమతులు తీసుకున్నామని మంత్రి బొత్స తెలిపారు.

ఏంసెట్ కౌన్సిలింగ్‌పై మాట్లాడుతూ..

ఎంసెట్ మూడో విడత కౌన్సిలింగ్ ఉండదని ముందే చెప్పామని, గత సంవత్సరం కేవలం తక్కువ మంది మూడో కౌన్సిలింగ్‌కు వచ్చారని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. అందుకే ఈ సారి విద్యార్థుల తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో రోడ్లు ప్రజల కోసం వేశాం.. అంతే తప్ప వైసీపీ నేతల కోసం కాదని.. అర్ధ రహిత విమర్శలు చేయడం సరికాదని మంత్రి బొత్స అన్నారు.

Updated Date - 2023-10-22T12:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising