CM Ramesh: అమిత్ షా, చంద్రబాబు భేటీపై ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-06-09T12:33:39+05:30
బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వం ఏపీలో త్వరలో వస్తుందని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా తో చాలా మంది నేతలు భేటీ అవుతారని.. అమిత్ షా, చంద్రబాబు భేటీపై ఇరువురు నేతలే చెబితే బాగుంటుందన్నారు.
విశాఖపట్నం: బీజేపీ (BJP) పాత్ర ఉండే ప్రభుత్వం ఏపీలో త్వరలో వస్తుందని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ (MP CM Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా తో చాలా మంది నేతలు భేటీ అవుతారని.. అమిత్ షా (Amit shah), చంద్రబాబు (Chandrababu Naidu)భేటీపై ఇరువురు నేతలే చెబితే బాగుంటుందన్నారు. పొత్తులు గురించి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం కేంద్రం నాయకత్వం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని అన్నారు. ఈ నెల 11 విశాఖలో రైల్వే గ్రాండ్‌లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని.. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు అమిత్ షా వివరిస్తారని చెప్పారు. భారత్‌లో శరవేగంగా రోడ్లు, పోర్ట్, ఎయిర్ పోర్ట్ రైల్వే అభివృద్ధి చెందాయన్నారు. రేపు తిరుపతిలో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని.. జేపీ నడ్డా ఈ సభలో పాల్గొంటారని అన్నారు. విశాఖలో అమిత్ షా బహిరంగ సభ పార్టీపరంగా జరుగుతుందన్నారు. విశాఖలో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభ.. జనసేనను పిలవలేదని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు.
Updated Date - 2023-06-09T12:33:39+05:30 IST