Union Govt: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నజరానా
ABN, First Publish Date - 2023-06-30T22:25:47+05:30
ఏపీ ప్రభుత్వం (Ap govt) మరో మూడు వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది. వెయ్యి కోట్లు 11 ఏళ్లకు, మరో వెయ్యి కోట్లు 16 ఏళ్లకు, ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు బాండ్ల వేలం వేయనుంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం (Ap govt) మరో మూడు వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది. వెయ్యి కోట్లు 11 ఏళ్లకు, మరో వెయ్యి కోట్లు 16 ఏళ్లకు, ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు బాండ్ల వేలం వేయనుంది. దీంతో ఈ ఏడాది FRBMలో ఏపీ అప్పు రూ.25,500 కోట్లకు చేరింది. ఇక ఈ ఏడాది FRBMలో మిగిలింది రూ.5 వేల కోట్లే. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో రూ.9 వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
విద్యుత్ సంస్కరణలను అపరిమిత వేగంతో అమలు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం (Union Govt) నజరానా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో నిండా మునిగింది.
Updated Date - 2023-06-30T22:27:03+05:30 IST