Anitha: భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు ఆ హీరోయిన్లు ఎందుకు స్పందించలేదు?
ABN, First Publish Date - 2023-10-10T12:10:57+05:30
74 సంవత్సరాల వయస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం బాధాకరమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
రాజమండ్రి: 74 సంవత్సరాల వయస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం బాధాకరమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం మీడియాతూ... తమకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా జగన్ (CM Jagan) సమావేశం పెట్టి నాలుగు పధకాలు ప్రకటించారన్నారు. జగన్ పోవాలని జనం అనుకుంటున్నారని.. జగన్ రోడ్డు పైకి వస్తే చీపుర్లతో కొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను జనం తన్నితరుముతారన్నారు. రోజాకు సంఘీబావం తెలిపే హీరోయిన్లు నారా భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తెలిసే జగన్ లండన్ పారిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు తెలియకుండానే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారని వంగలపూడి అనిత వెల్లడించారు.
Updated Date - 2023-10-10T12:17:21+05:30 IST