Tirumala: చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయం మూసివేత
ABN, First Publish Date - 2023-10-28T21:29:14+05:30
చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు.
తిరుమల: చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. నేటి అర్ధరాత్రి 1:05 నుంచి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసి వేశారు. రేపు తెల్లవారుజామున 3:15 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకొనున్నాయి. పుణ్యావహచనం,శుద్ధి అనంతరం ఏకాంతంగా శ్రీవారికీ సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను అర్చకులు నిర్వహించనున్నారు. గ్రహణం నేపథ్యంలో 13 గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. అన్నదానం, లడ్డూ కౌంటర్లను టీటీడీ మూసివేసింది.
Updated Date - 2023-10-28T21:29:32+05:30 IST