ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: అనంతలో వర్షం

ABN, First Publish Date - 2023-06-01T20:32:42+05:30

అనంతపురం జిల్లా (Anantapur District)లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అనంతపురం జిల్లా (Anantapur District)లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గార్లదిన్నె, రాయదుర్గం మండలాల్లో గాలీవాన బీభత్సం సృష్టించింది. గార్లదిన్నె మండలం కల్లూరులో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాల్‌లో శ్రీనివాసులు ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. బెళుగుప్ప మండలం గంగవరంలో పిడుగుపాటుకు ఎర్రిస్వామికి చెందిన మూడు గొర్రెలు మృతి చెందాయి. బాధితుడికి రూ.50 వేలు నష్టం వాటిల్లింది. బొమ్మనహాళ్‌, శింగనమల, ఉరవకొండ, కుందుర్పి, కణేకల్లు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. యాడికి మండలంలో మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులకు 15 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నార్పల, పామిడి, గుత్తి, గుంతకల్లు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.

Updated Date - 2023-06-01T20:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising