Kotamreddy: నారాయణస్వామి నీ బ్రతుకేంటో తెలుసు..
ABN, First Publish Date - 2023-09-22T14:38:27+05:30
నెల్లూరు: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
నెల్లూరు: తెలుగుదేశం అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను (YCP MLAs) అడ్డుకున్న బాలకృష్ణ (Balakrishna)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (Kotam Reddy Srinivasulu Reddy) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి నారాయణస్వామి (Narayanaswamy) నీ బ్రతుకేంటో నాకు తెలుసు. బస్టాండ్‌లో పిక్ ప్యాకెట్ కొట్టే బతుకు నీది.. బాలకృష్ణను విమర్శించే స్థాయి నీకు లేదు.. మీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి బాలకృష్ణను విమర్శించాలి’’.. ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. గంట.. అరగంట మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)... బాలకృష్ణవి పెట్టుడు మీసాలు కాదు దమ్మున్న మీసాలని, కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని.. బాలకృష్ణని విమర్శిస్తే తోలు తీస్తామని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు.
Updated Date - 2023-09-22T14:38:27+05:30 IST