AP NEWS: నెల్లూరులో డ్రగ్స్ కలకలం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:06 AM
నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అద్దెకి ఇల్లు తీసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నెల్లూరు: నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అద్దెకి ఇల్లు తీసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్‌లో చూసి నిందితుడు డ్రగ్స్ తయారీచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారుగా రూ.2లక్షల పెట్టుబడితో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 560 గ్రాముల డ్రగ్స్‌తో పాటు 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారుచేసి విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మీడియాకి వివరాలను ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు.
Updated Date - Dec 18 , 2023 | 12:06 AM