Minister Botsa: అంగన్వాడీలు సమ్మె విరమించాలి.. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 09:31 PM
అంగన్‌వాడీ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు విఫలమయ్యాయి. యథావిథిగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
అమరావతి: అంగన్‌వాడీ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు విఫలమయ్యాయి. యథావిథిగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగన్వాడీ సంఘాల నేతలు ససేమీరా అంటున్నారు.
"అంగన్వాడీలను సమ్మెను విరమించాలని కోరాం. అంగన్వాడీలు సమ్మె విరమించుకుంటే మేం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం అందడం లేదు. అంగన్వాడీల సమ్మె వల్ల పిల్లలకు బాలామృతం అందడం లేదు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారు?. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను మేం ఆమోదించాం. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని వివరించాం. గ్రాట్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించాం. సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని చెప్పాం. సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తాం. 15 రోజుల సమ్మెతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 3వ తేదీ తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలి. జగనన్న కిట్లు అందించేందుకు సహకరించాలని అంగన్వాడీలను కోరాం. సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత మరోమారు చర్చలు జరుపుతాం. మేం అంగన్వాడీలను బెదిరించడం లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాం." అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 09:33 PM