ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mekathoti Sucharita: ఉంటే వైసీపీలో...లేకుంటే ఇంట్లో...

ABN, First Publish Date - 2023-01-06T20:45:54+05:30

ఉంటే వైసీపీలో ఉంటా లేకుంటే ఇంట్లోనే ఉంటానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్‌ కుటుంబంతోనే మా పయనం’’ అని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) మరోసారి ఆసక్తికర వాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదనందిపాడు: ‘‘ఉంటే వైసీపీలో ఉంటా లేకుంటే ఇంట్లోనే ఉంటానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్‌ కుటుంబంతోనే మా పయనం’’ అని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) మరోసారి ఆసక్తికర వాఖ్యలు చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పెదనందిపాడు (Pedanandipadu) మండలం నాగులపాడులో జరిగిన వైఎస్సార్‌ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో సుచరిత మాట్లాడుతూ కాకుమానులో ఓ అంతర్గత సమావేశంలో మాట్లాడిన మాటలపై సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలను నమ్మవద్దన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తాను ఏంటో తెలుసన్నారు.

దుష్ప్రచారాలు మాని కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తన భర్త దయాసాగర్‌ (Dayasagar) వేరే పార్టీలోకి వెళ్తున్నారన్న సంభాషణ జరగడంతో.. ఒక కుటుంబంలో ఏ భార్య అయినా తన భర్త అడుగుజాడల్లో నడుస్తాననడంలో తప్పేంటని ప్రశ్నించారు. కుటుంబంలో అందరూ ఒకే మాటగా ఉంటారని, దీనికి ఉదాహరణగానే పెదనందిపాడులో ఒక నాయకుడు గతంలో టీడీపీలో ఉండి వైసీపీలోకి వచ్చారని గుర్తుచేశారు. ఆయన వెంటే అతని భార్య కూడా ఉంది కదా అని ఉదహరించారు. తనను ఎలాంటి సమాచారం అడగకుండా సోషల్‌ మీడియాలో వచ్చే కథనాలపై స్పందించవద్దని సుచరిత తెలిపారు.

Updated Date - 2023-01-06T20:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising