శ్రీశైలం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచారం
ABN, First Publish Date - 2023-10-08T22:08:01+05:30
శ్రీశైలం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరిస్తోంది.
నంద్యాల: శ్రీశైలం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరిస్తోంది. చిరుతపులి సంచారంతో స్థానికులు, శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. పాలధార పంచదార మెట్ల మార్గంలోని చిరుతపులి గోడపై కూర్చుని భక్తులకు కనపడడంతో ఆందోళన చెందారు. చిరుతపులిని చూసిన భక్తులు తమ సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించారు. భక్తులు వీడియోలు తీస్తూ శబ్దం చేస్తుండటంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుతపులి వెళ్లిపోయింది.
Updated Date - 2023-10-08T22:08:01+05:30 IST