lawyers: ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌లో పలు సెక్షన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:38 PM
ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2022లో పలు సెక్షన్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో కర్నూలు జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజ్యాంగంలో 300A విరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2022లో పలు సెక్షన్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో కర్నూలు జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజ్యాంగంలో 300A విరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూ అధికారులకు సుమోటోగా ప్రజల ఆస్తులపై విచారణ జరిపే అధికారం ఇవ్వడం వల్ల అస్తి హక్కులు కోల్పోయే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
వారసత్వ హక్కులను నిర్ణయించే అర్హత రెవెన్యూ అధికారులకు ఇవ్వడం న్యాయ వ్యవస్థ అధికారాలను తీసుకోవడమేనని, ఇది ఇండియన్ సాక్సెషన్ యాక్టుకు విరుద్ధం అని పిటిషన్ పేర్కొన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 2022కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు సీనియర్ కౌన్సిల్ యలమంజుల బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు.
Updated Date - Dec 26 , 2023 | 02:38 PM