ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: దాని ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు: లోకేష్

ABN, First Publish Date - 2023-05-03T18:31:34+05:30

రాష్ట్రంలో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రాష్ట్రంలో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ యువనేత లోకేష్‌ను అనుగొండ ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో 61మంది అమాయక ప్రజలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అనుగొండ వాగు పూడిక తీత చేపట్టి ముంపుబారిన పడకుండా రక్షణ కల్పిస్తామన్నారు.

Updated Date - 2023-05-03T18:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising