AP NEWS: నంద్యాలలో మాటు వేసి దారుణంగా.. చివరకు ఆగంతకులు ఆ వ్యక్తిని ఏం చేశారంటే..!
ABN, First Publish Date - 2023-09-04T22:08:26+05:30
జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నంద్యాల(Nandyal) మండలంలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా దుండగులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నంద్యాల: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నంద్యాల(Nandyal) మండలంలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా దుండగులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల మండలం శివారులోని అయ్యలూరి మెట్ట వద్ద దారుణ హత్య జరిగింది.నవజీవన్ స్కూల్ ఉద్యోగి నర్సోజిని ఇద్దరు ఆగంతకులు వెంటాడి చంపేశారు.స్కూల్ డ్యూటీ ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న నర్సోజిపై ఆగంతకులు దాడి చేశారు.మరో బైక్ పై ఉద్యోగి నర్సోజిని ఫాలో చేసి ప్రత్యర్థులు బైక్‌తో ఢీకొట్టారు. బైక్ నుంచి పడిపోయిన తర్వాత నర్సోజిని చంపడానికి ఆగంతకులు యత్నించారు.ప్రాణ భయంతో పారిపోతున్న నర్సోజిని ఆగంతకులు వెంటాడి తలపై నరికి హతమార్చారు. ఆగంతకులు హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో స్థానికులు గుర్తించలేదు.సమాచారం అందుకున్న నంద్యాల రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూసు టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-09-04T22:08:26+05:30 IST