ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: అమరావతి నిర్మాణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2023-03-28T19:28:56+05:30

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజధాని అమరావతిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ అమరావతి (Amaravathi) అని, కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఏమీ జరగట్లేదని కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అమరావతి పెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా క్రియేట్ అయిందని కేటీఆర్ అన్నారు. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమీ జరగడం లేదన్నారు. దేశంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పెద్దదిగా ఉందని, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు 50 చెరువులు దత్తతకు తీసుకున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. గుంటూరు బాగుందని చెప్పారు. తాను ఎవర్నీ లేనిపోని కామెంట్స్ చేయనన్నారు. క్రెడాయ్ సమావేశంలో తన స్నేహితుడు చెప్పిన విషయాన్ని ప్రస్తావించినందుకు రోజంతా టీవీల్లో 50 సార్లు ప్రసారం చేశారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడతో సహా అన్ని బాగున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. చివర్లో తాను వాటి గురించి మాట్లాడనని చెప్పారు. భవిష్యత్‌లో ట్రిపుల్ ఆర్ వస్తుందని, దేశంలో హెచ్‌ఎండీఏ మెట్రో డెలప్‌మెంట్ అథారిటీ పెద్దని, 7 వేలకుపైన స్క్వేర్ కిలోమీటర్లు ఉందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఖాజాగూడ వద్ద పెద్ద చెరువును కేటీఆర్ ప్రారంభించారు.

Updated Date - 2023-03-28T19:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising