Vijayawadaలో దేవినేని అవినాష్‌కు చేదు అనుభవం
ABN, First Publish Date - 2023-01-10T11:27:27+05:30
విజయవాడ (Vijayawada) తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ (Devineni Avinash)కు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణలంక రాణి గారి తోటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్‌ను మహిళలు
అమరావతి: విజయవాడ (Vijayawada) తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ (Devineni Avinash)కు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణలంక రాణి గారి తోటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్‌ను మహిళలు అడ్డుకున్నారు. ‘‘పని చేసిన వాళ్ల జెండాలను మా ఇళ్లపై పెట్టుకుంటాం అందుకే తెలుగుదేశం (TDP) జెండాను మా ఇళ్లపై పెట్టుకున్నాం. మీకోసం పనిచేశాం మీరు మాకు ఏం చేశారు. మమ్మల్ని మోసం చేశారంటూ’’ అవినాష్‌ను పలువురు మహిళలు నిలదీశారు. తాను ఒంటరి మహిళనని పింఛన్ (Pension) రాయమన్నా.. ఇల్లు రాయమన్నా.. వాలంటీర్ శాంతారెడ్డి డబ్బులు ఇస్తేనే రాస్తానని చెబుతుందని స్థానిక మహిళలు అవినాష్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నాయకులు ఖంగుతున్నారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ రామిరెడ్డి (YCP Corporator Ramireddy) మమ్మల్ని మోసం చేశారంటూ రామిరెడ్డిని చూపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో దేవినేని అవినాష్ మౌనంగా ఉండిపోయారు. చివరకు వైసీపీ నేతలు మహిళలకు సర్ది చెప్పి ఏ సమస్య ఉన్న ఇకపై పరిష్కరిస్తానని చెప్పి ఎక్కడి నుంచి జారుకున్నారు.
Updated Date - 2023-01-10T11:29:00+05:30 IST