ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GV Reddy: సజ్జల అలా మాట్లాడటం సిగ్గుచేటు..

ABN, First Publish Date - 2023-02-04T16:05:16+05:30

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case)లో నిందితులు సొంత కుటుంబ సభ్యులేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ రెడ్డి (GV Reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case)లో నిందితులు సొంత కుటుంబ సభ్యులేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ రెడ్డి (GV Reddy) అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) .. నవీన్ (Naveen), ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy)లకు ఫోన్ చేశారని సీబీఐ విచారణలో తేలిందన్నారు. ఇందులో తప్పేముందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తప్పు ఉందో.. లేదో సీబీఐ తేలుస్తుందని.. ఆ విషయం చెప్పడానికి సజ్జల ఎవరని ప్రశ్నించారు. సీబీఐ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సీఎస్ తన కారులో ఎక్కించుకుని వెళ్లడం ఏంటన్నారు. అక్కడ అసలు సీఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy)కి ఏం పని అని నిలదీశారు. సీబీఐ అధికారులు రాష్ట్రానికి కొస్తే సీఎం జగన్ (CM Jagan) హడావుడిగా డిల్లీ ఎందుకు వెళ్లారన్నారు. నారా సుర రక్త చరిత్ర అంటూ రాసిన రాతలకు వైసీపీ నేతలు (YCP Leaders) ఏం సమాధానం చెబుతారని జీవీ రెడ్డి ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డు (Phone Call Record) సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘‘అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులో సంచలనం ఏముంది?. నవీన్‌ అనే వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌ ఇంట్లో అటెండర్‌. కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ ఆరోజు.. ఈరోజు కూడా జగన్‌ దగ్గరే ఉన్నారు. ఇందులో అసహజం ఏముంది?. వివేకా హత్యను జగన్‌కు లింక్‌ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. వివేకా చనిపోయిన విషయం అవినాష్‌రెడ్డికి తెలిసింది. జగన్‌కు చెప్పడానికే నవీన్, కృష్ణమోహన్‌కి అవినాష్‌ ఫోన్ చేసి ఉండొచ్చు. సమాచారం ఇవ్వడాన్ని ఎందుకు తప్పుబడుతున్నారు. సమాచారం ఇచ్చేందుకు సిబ్బందికి ఫోన్‌ చేయడం సాధారణమే. మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) ఫోన్‌ చేయాలన్నా.. ఎవరో ఒకరికి ఫోన్‌ చేయాల్సిందే కదా. అవినాష్‌ రెడ్డి తర్వాత నవీన్‌కు నోటీసులిస్తే.. నవీన్‌ ఎవరోనంటూ ఏదేదో ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సజ్జల చెప్పుకొచ్చారు.

కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ (CBI) ప్రశ్నించింది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా శుక్రవారం రోజున దర్యాప్తు జరిగింది. ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఆధారంగా కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ బృందం ప్రశ్నించింది. ఆయన తర్వాత వైఎస్ భారతి (YS Bharathi) పీఏ నవీన్ కూడా విచారణకు హాజరయ్యాడు. కాల్ డేటాపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు చేయగా కీలక సమాచారం రాబట్టినట్లు తెలియవచ్చింది.

Updated Date - 2023-02-04T16:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising