Bonda Uma: అమరావతిపై కక్షతోనే సెంటు పట్టాలు పంపిణీ
ABN, First Publish Date - 2023-05-26T11:57:41+05:30
అమరావతిపై కక్షతోనే సీఎం జగన్ సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని
Bonda Uma
అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వం సెంటు భూమి పంచడంపై టీడీపీ నేత బోండా ఉమ (Bonda Umamaheswara Rao) ధ్వజమెత్తారు. అమరావతిపై కక్షతోనే సీఎం జగన్ (CM JAGAN) సెంటు పట్టాల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. సెంటు పట్టాలు అనేవి ఒక బోగస్‌గా కొట్టిపారేశారు. కనీస వసతులుగా రోడ్లు, కరెంట్ ఏమీ లేకుండానే సెంటు పట్టాలు పేదలకు ఇస్తే ఏమీ చేసుకుంటారని ప్రశ్నించారు. అయినా సుప్రీం కోర్టు సెంటు పట్టాకు చట్టబద్ధత లేదని చెప్పినా జగన్ పేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగే ముఖ్యమంత్రి సభకు ప్రజలను బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
Updated Date - 2023-05-26T11:57:41+05:30 IST