Vijayawada: పవన్‌పై కేసు నమోదు కావడంతో మండిపడ్డ జనసైనికులు..
ABN, First Publish Date - 2023-07-13T16:17:12+05:30
విజయవాడ: విజయవాడ కృష్ణలంకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదవడంపై జనసైనికులు మండిపడ్డారు. గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో జనసైనికులు ఆందోళన చేపట్టారు.
విజయవాడ: కృష్ణలంకలో జనసేన అధినేత (Janasena Chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదవడంపై జనసైనికులు మండిపడ్డారు. గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (Potina Venkata Mahesh) ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో జనసైనికులు ఆందోళన (Protest) చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాజకీయ దుర్బుద్ధితోనే పవన్ కళ్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. నగర పోలీస్ కమిషనర్ దీనిపై వెంటనే స్పందించి ప్రకటన చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై తమ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పకుండా పిరికిపంద చర్యలా పోలీస్ కేసులను నమోదు చేశారని విమర్శించారు. ఈ నియంత పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆందోళన తీవ్రతరం చేస్తామని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.
కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయవాడ, కృష్ణలంక పోలీసులు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేశారు. విజయవాడ సచివాలయంలో పనిచేస్తున్న దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్‌పై సెక్షన్ 153, 153ఏ, 505 (2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-07-13T16:17:12+05:30 IST