ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi: రాజధాని గ్రామాల్లో ఎటు చూసినా పోలీసులే..

ABN, First Publish Date - 2023-05-26T07:32:13+05:30

అమరావతి: రాజధాని గ్రామాల్లో శాంతియుత నిరసనలకు రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. రాజధాని గ్రామాల్లో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలపాలని పిలుపిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని గ్రామాల్లో శాంతియుత నిరసనలకు రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. రాజధాని గ్రామాల్లో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలపాలని పిలుపిచ్చారు. అలాగే రాజధాని గ్రామంలోని రైతుల దీక్షా శిబిరాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లో ఆర్5 జోన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి నిరసన తెలపానున్నారు. రాజధాని రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా వారి భూముల్లో సెంటు స్థలాలు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాగా శుక్రవారం వెంకటపాలెం వద్ద సెంటు స్థలాల పంపిణీకి ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. రైతుల ఆందోళనల పిలుపు, వెంకట పాలానికి ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు వేలాది మంది పోలీసులు మోహరించారు. సెంటు పట్టాలు పొందే వారితోపాటు, వారి కుటుంబ సభ్యులు కూడా సభకు హాజరు కావాల్సిందే అంటూ వాలంటీర్లు హుకుం జారీ చేస్తున్నారు. సెంట్ స్థలాలు పొందే వారిలో చాలామంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని రైతులు అంటున్నారు. కారులో తిరిగే వారికి, ఖరీదైన సొంతిల్లు ఉన్నవారికి సెంటు స్థలాలు మంజూరు చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. సెంటు స్థలం మీటింగుకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే ముఖ్యమంత్రి పాల్గొనే సభా కార్యక్రమం చుట్టూ వేలాది మంది పోలీసులు మోహరించారని రైతులు విమర్శించారు.

Updated Date - 2023-05-26T07:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising